కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి జేడీఎస్ నేత దేవెగౌడ ఓ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై ప్రస్తావించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.