TG: రీజినల్ రింగ్ రోడ్ కోసం మూడేళ్లుగా కృషి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది. అక్కడక్కడా భూసేకరణ సమస్యలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను మోదీ ప్రారంభిస్తారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగింది. నిజమైన మార్పు మా పార్టీతోనే సాధ్యం’ అని పేర్కొన్నారు.