AP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ధర్మవరం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫామ్‌హౌజ్ ఖాళీ చేయాలని వెంకట్రామిరెడ్డి మరదలు వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ భూమితో కలిపి 30 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించిన అధికారులు.. నోటీసులపై 10రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. లేకపోతే నిర్మాణాలను సీజ్ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.