ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు అండగా ఉంటామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. పాంగ్యాంగ్లో రష్యన్ భద్రతాధికారులతో కిమ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. సైనిక పరంగా రష్యాకు తమ మద్దతు కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. కాగా, గతంలో ఉక్రెయిన్‌తో పోరాడటానికి రష్యాకు సాయంగా కిమ్ తన సైన్యాన్ని పంపించిన విషయం తెలిసిందే.