NZB: బాల్కొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు చేరుకున్న ఆయన నేరుగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల బోధనాభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరీక్షించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా స్థాయిని అడిగి తెలుసుకున్నారు.