విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తెలుగు కుర్రాడు అమన్ రావు (200*) డబుల్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 352/5 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బెంగాల్ 44.4 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. HYD బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు తీశాడు.