ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో A7గా ఉన్న అమన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితుడు తరఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కాగా అమన్‌కు డ్రగ్స్ పేడర్లతో సంబంధం ఉన్నట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే.