PLD: విజయవాడ భవానీ ఐలాండ్‌లో ఈనెల 8 నుంచి 10 వరకు APTA ఆధ్వర్యంలో ‘అవకాయ అమరావతి’ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 9, 10 తేదీల్లో నిర్వహించే మార్షల్ ఆర్ట్స్ వర్క్‌షాప్‌లో పాల్గొనేవారు ఈనెల 7 సాయంత్రం 4 గంటల లోపు నరసరావుపేట జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంను సంప్రదించాలని మంగళవారం అధికారి పీ. నరసింహరెడ్డి తెలిపారు.