TG: కులగణనను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. విమర్శించడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. కులగణన జరిగితే ఆర్థిక, సామాజిక విషయాలు బయట పడతాయని అనుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై హరీష్‌రావు, KTR విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కులాలపై బీఆర్ఎస్ వైఖరేంటో అర్థమవుతోందన్నారు.