బీబీసీ డాక్యుమెంటరీని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పు : వీహెచ్
బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకులు పెట్టిన విగ్రహాన్ని కూల్చడం తో పాటు ఆనాడు తీసుకొచ్చిన(Ambedkar) అంబేద్కర్ విగ్రహాన్నిపోలీస్ లు తీసుకుపోయారని వీహెచ్ అన్నారు. ఎన్ని పోరాటాలు చేసిన న్యాయం జరగలేదని అన్నారు. కోర్ట్ మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని ఇచ్చాయాలని చెప్పిందన్నారు. విగ్రహం నాకు ఇవ్వడం కాదు ఎక్కడ నుండి తీసుకెళ్లారో అక్కడే విగ్రహాన్ని పెట్టాలని ఆయన చేశారు. మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం మట్లాడారని, నేను భట్టి కేటీఆర్ని కలిస్తే అంబేద్కర్ విగ్రహ ఎర్పాటు విషయంలో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు.
జ్యోతిరావు పూలే (Pūlē )ఆడిటోరియం కట్టడానికి ( KTR) కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీబీసీ ని బ్యాన్ చేయాలని బీజేపీ అనడం తప్పఅని తెలిపారు. పత్రికలు ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చిందని, వాస్తవాల్ని బీబీసీ చూపించిందన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమా లేక డిక్టేటర్ దేశమా? అని ప్రశ్నించారు. బీజేపీ చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియాతో పాటు(Britain) బ్రిటన్ లో కూడా వివాదాస్పదం అయింది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట్. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ‘ఇండియా:( The Modi Question) ‘ ది మోదీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే, పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు.
ఇదిలా ఉంటే ఈ (Document) డాక్యుమెంట్ నేపథ్యంలో బీబీసీని నిషేధించాలని హిందూ సేన చీఫ్ విష్ణుగుప్తా( Supreme Court)సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ (Petition) పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు నిషేధాన్ని తిరస్కరించింది. దీన్ని తప్పుడు భావనగా పేర్కొంది. ఒక డాక్యుమెంటరీ దేశంపై ఎలా ప్రభావం చూపుతుందని ప్రశ్నించింది. పిటిషనర్ తరఫున సీనియర్ ( lawyer )న్యాయవాది పింకీ ఆనంద్.. బీబీసీ ఉద్దేశపూర్వకంగా భారత ప్రతిష్టను కించపరుస్తుందని వాదించారు. ఈ డాక్యుమెంటరీ వెనక కుట్ర దాగి ఉందని (NIA) ఎన్ఐఏతో విచారణ దర్యాప్తు చేయాలని కోరారు. ఈ డాక్యుమెంటరీ లింకులను తొలగించాలని గతంలో కేంద్ర ప్రభుత్వం(Twitter,) ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది.