TG: హైదరాబాద్లో గాడిద పాల ఉత్పత్తి పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు. తెలంగాణ, AP, తమిళనాడు, కర్ణాటక రైతులను చెన్నై సంస్థ మోసగించింది. దాదాపు రూ.100 కోట్ల వరకు మోసపోయామని బాధితులు తెలిపారు. ఒక్కో గాడిదను రూ.లక్షన్నర వరకు డాంకీ ప్యాలెస్ సంస్థ అమ్మిందని చెప్పారు. లీటర్ పాలు రూ.1600కు కొంటామని సంస్థ బాధితులకు హామీ ఇచ్చింది. 3 నెలలపాటు నమ్మకం కలిగించి..18 నెలలుగా పాలకు డబ్బులు ఇవ్వట్లేదని బాధితులు పేర్కొన్నారు.