TG: భూదాన్ భూముల వ్యవహారంలో డీజీపీ జితేందర్ని ఈడీ అధికారులు కలిశారు. అమోయ్ కుమార్ విచారణ సమయంలో తమ వద్దకు వచ్చిన 12 ఫిర్యాదులను ఈడీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరారు. దర్యాప్తుకు కావాల్సిన సమాచారం పోలీసులు ఇవ్వట్లేదని ఈడీ అధికారులు తెలిపారు. భూదాన్ భూముల వ్యవహారంలో అమోయ్ కుమార్తో పాటు మరో ఇద్దరు అధికారులను ఈడీ విచారించింది.