TG: మన్మోహన్ అసమాన్యమైన వ్యక్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘చేపట్టిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నేత మన్మోహన్. బలమైన ఆర్థిక శక్తిగా దేశాన్ని నిలబెట్టారు. ప్రపంచ వాణిజ్యానికి దేశం తలుపులు తెరిచారు. దేశంలోని సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని చట్టాల ద్వారా ప్రజల్లో ధైర్యం నింపారు. ఆయన నిర్ణయాలు పేదలను దారిద్య్రం నుంచి బయటపడేశాయి’ అని పేర్కొన్నారు.