హిండెన్ బర్గ్ నివేదికతో గౌతమ్ అదానీ కంపెనీకి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. అదానీ కంపెనీల అవకతవకలపై విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ రోజు ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ నిర్వహించిన బడ్జెట్ ఆజ్తక్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ ఇష్యూలో అశోక్ గెహ్లట్ను విచారించాలని కోరారు. అదానీ కంపెనీలో వ్యవహారం ముందుకు తీసుకొచ్చి.. దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు విపక్షాలు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు.
అదానీ గ్రూపునకు యూపీఏ ప్రభుత్వం రూ.72 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అందులో రూ.60 వేల కోట్లను అదానీకి గెహ్లట్ ఇచ్చారని ఆరోపించారు. అదానీ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే ఎల్ఐసీ, ఎస్బీఐ తమ వైఖరిని తెలియజేశాయని తెలిపారు. ప్రధాని పదవీ చేపట్టిన తొలి రోజే ప్రధాని మోడీ సహకార సమాఖ్య విధానం గురించి చెప్పారన్నారు. కేంద్రంలో ప్రతిపక్షం.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం సహకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు పరచడంలో సహకరించడం లేదన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదలపై మంత్రులు టార్గెట్ అవుతున్నారా అని ప్రశ్నించగా.. తాము కాదు సన్యాసి అవుతారని పేర్కొన్నారు.