TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి డిజిటల్ కార్డుల కోసం ఇంటింటి సర్వే నిర్వహించనుంది. 119 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద డిజిటల్ కార్టులు జారీ చేయనున్నారు. మొత్తం 238 గ్రామాలు, డివిజన్లను ఎంపిక చేశారు. రేపు కార్డుల సర్వేను CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈనెల 7వ తేదీ వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబాల హెల్త్ ప్రొఫైల్ను రికార్డు చేయనున్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది.