రానున్న నాలుగు రోజులు తెలంగాణలో, మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలో ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.