TG: మన్మోహన్ హయాంలో ఎన్నో గొప్ప చట్టాలు తీసుకొచ్చారని CPI నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ‘మన్మోహన్కు సంతాపం తెలపటం ఓ పవిత్ర కార్యక్రమం. సంతాప సభల్లో వేరే అంశాలు మాట్లాడిన ఘటనలు ఇంతకముందు చూడలేదు. వ్యక్తిగత, వివాదాస్పద అంశాలతో ముడిపెట్టటం సరికాదు. ఇలాంటి వాటివల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది. నివాళి కార్యక్రమంలో వ్యక్తి గొప్పతనాన్ని చెప్పాలి’ అని తెలిపారు.