AP: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు బడ్జెట్ కేటాయింపులు దోహదపడతాయని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సూపర్ సిక్స్ హామీలకు కేటాయింపులు.. తమ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందించేలా కేటాయింపులు ఉన్నాయని.. అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్ల కేటాయింపుతో మాట నిలబెట్టుకున్నామని చెప్పారు.