రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఉక్రెయిన్ ఏకంగా 17 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కో నగరంపై దాడి చేసింది. అయితే రామెన్స్కోయ్, కొలోమెన్స్కీ జిల్లాలతో పాటు మాస్కోకు నైరుతి దిశలో ఉన్న డొమోడెడోవో నగరంలో 12 డ్రోన్లను ధ్వంసం చేశామని రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడుల కారణంగా ప్రాణ నష్టం జరగలేదని.. ఆ ప్రాంతంలో అత్యవసర సేవలు కొనసాగిస్తున్నామన్నారు.