AP: తెలుగుభాష ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. మాతృభాష నేర్చుకున్న పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని.. తల్లిదండ్రుల చొరవతోనే మాతృభాష మనుగడ సాధ్యపడుతుందని తెలిపారు. తన మాతృభాష మరాఠీ అయినప్పటికీ.. తెలుగులోనే చదువుకున్నట్లు వెల్లడించారు. తన పిల్లలకు పెద్ద బాలశిక్ష ఇచ్చి చదవిస్తున్నట్లు తెలిపారు. సంస్కృతి, వారసత్వం భాషతోనే ముడిపడి ఉంటాయన్నారు.