తన కాళ్లు పట్టుకుంటే పనులు జరగవని కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ ప్రజలకు వెల్లడించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్లోని ఠికమ్గఢ్లో తన కార్యాలయం వద్ద వినూత్నంగా బోర్డు ఏర్పాటు చేశారు. కాళ్లు పట్టుకోవడం పూర్తిగా నిషేధం.. అలా చేసేవారికి పనులు అప్పగించే ప్రసక్తి లేదని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. కార్యాలయం వద్దకు వచ్చిన వారంతా ఈ బోర్డును ఆసక్తిగా తిలకిస్తున్నారు.