AP: అసెంబ్లీ క్యాంటీన్లో భోజనం బాగోలేదని అధికారులు, ఫుడ్ కాంట్రాక్టరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అదేమైనా భోజనమా? మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా’ అని ప్రశ్నించారు. అయితే నిన్న సభ వాయిదా పడ్డాక భోజనం చేసిన ఎమ్మెల్యేల్లో కొందరు భోజనం బాగోలేదని స్పీకర్‌కు తెలిపారు. దీంతో కాంట్రాక్టర్‌ను పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు.