AP: ఆర్థిక ఉగ్రవాది ఏం చేస్తారో గత ఐదేళ్లలో చూశామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఐదేళ్లపాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీల్లేకుండా చేశారని.. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో అర్థం కావట్లేదని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకమే జరిగిందని ఆరోపించారు.