TG: రాష్ట్రంలో ఏడాదిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అబద్దాలతో నడిపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని నడుపుతోందన్నారు. CM రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్దాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్కు ATMగా మారాయన్నారు. RR ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నాయని, రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు.