తిరుమల శ్రీవారిని ఇస్రో బృందం దర్శించుకుంది. PSLV C-60 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించింది. కాగా, ఇవాళ శ్రీహరికోట నుంచి PSLV C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా స్పాడెక్స్ పేరుతో జంట ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. రాత్రి 10:15కు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.