TG: ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో గొప్ప విధానాలు తీసుకొచ్చారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నత శిఖరానికి ఆయన ఎదిగారన్నారు. పీవీ నరసింహారావే మన్మోహన్ను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేశారన్నారు. మన్మోహన్ సింగ్ గ్రామీణ పేదలకు పని కల్పించే పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు.