కెనడా దిగుమతి సుంకాలపై అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. గ్రేట్ స్టేట్ ఆఫ్ కెనడా గవర్నర్ ట్రూడో అని సంబోధిస్తూ.. ఆయనతో డిన్నర్ చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మళ్లీ గవర్నర్తో సమావేశమై సుంకాలు, వాణిజ్యంపై లోతుగా చర్చలు జరపాలని అనుకుంటున్నానని, వాటి ఫలితం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. కాగా, ఇటీవల ఫ్లోరిడాలో ట్రూడోతో భేటీ అయిన తర్వాత.. వలసలు ఆపకపోతే కెనడా USకు 51వ రాష్ట్రం అవుతుందని ట్రంప్ అన్నారు.