జార్ఖండ్ ఏర్పాటును లాలూప్రసాద్ యాదవ్ వ్యతిరేకించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బగోదర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జార్ఖండ్లో ఎన్డీయే అనుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు. ప్రజలు అవినీతి నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. జార్ఖండ్ ఏర్పాటును లాలూ వ్యతిరేకిస్తే.. బీజేపీ దాన్ని చేసి చూపించిందని వెల్లడించారు.