TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని అని, భూసేకరణ చట్టం తెచ్చారన్నారు. న్యూక్లియర్ ఒప్పందంపై వ్యతిరేకత ఉన్నా.. దేశ క్షేమం దృష్ట్యా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. సోనియా సూచనల మేరకు గొప్ప చట్టాలు తీసుకొచ్చారని, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారన్నారు.