AP: గుంటూరు జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులు YCP హయాంలో నిలిచిపోయాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో బీసీ సంక్షేమ వసతిగృహంను ఆయన ప్రారంభించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రకృతి సంపదను అందరం కాపాడుకోవాలని సూచించారు. రూ. 100 కోట్లతో ఎస్సీ హాస్టల్ నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో హాస్టళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.