AP: అల్లు అర్జున్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు ‘సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. అల్లు అర్జున్ వెళ్లకపోయినా కనీసం చిత్ర బృందం వెళ్లి ఉండాల్సింది. మానవతా దృక్పథం లోపించినట్లైంది. తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేది’ అని పేర్కొన్నారు.