టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి కాసేపట్లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని కలవనున్నారు. అన్నా యూనివర్సిటీ విద్యార్థని అత్యాచార ఘటనపై ఇప్పటికే లేఖ విడుదల చేసిన విజయ్ రాష్ట్ర మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం చూస్తూ చెప్పరాని బాధను అనుభవిస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలవడం చర్చనియాంశమైంది.