అమెరికా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ప్రజల అభీష్టం ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడాను. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌నకు అభినందనలు తెలిపాను. శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతుందని ట్రంప్‌నకు హామీ ఇచ్చాను. ఎన్నికల్లో కమలా హారిస్ స్ఫూర్తిదాయక పోరాటం చేశారు’ అని పేర్కొన్నారు.