ఓవర్కాన్ఫిడెన్స్ను వదిలించుకోడానికి అనేక మార్గాలు. అంతిమ నిర్ణయం మనదే అయినా, నలుగురి సలహాలూ స్వీకరించాలి. నిజానిజాల సంగతి ఎలా ఉన్నా విమర్శలను స్వాగతించాలి. సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. కొత్త నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. టన్నులకొద్దీ అహాన్నీ, ఉందనుకుంటున్న జ్ఞానాన్నీ, లేదనుకుంటున్న అజ్ఞానాన్నీ… వదిలేసుకోవాలి. మనలోంచి మనం బయటికొచ్చి.. ఆత్మసమీక్ష చేసుకోవాలి. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని మాయలో పడేస్తోంది.