సిరియాలో ఇరాన్ క్షిపణి ఉత్పత్తుల రహస్య స్థావరం ఉన్నట్లు ఇజ్రాయెల్ కమాండో రైడ్లో బయటపడింది. భూగర్భంలో సిరియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ సైంటిఫిక్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆధ్వరంలో దీన్ని నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ గుర్తించింది. ఈ విషయాన్ని అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందట. ఇలాంటి సౌకర్యాలతో ముప్పు పెరుగుతోందని ఆ దేశం భావిస్తోంది.