సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి 2400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక బస్సులు నపనున్నట్లు పేర్కొంది. జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్లతో సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు సీబీఎస్ నుంచి బయలుదేరనున్నాయి.