అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని తాలిబన్ పాలకులు ఆదేశించారు. స్త్రీలు బయటివారికి కనిపిస్తే అది అభ్యంతరకర చర్యలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే అలాంటి కట్టడాలు ఉంటే అవి కనిపించకుండా మూసివేయాలని ప్రకటన జారీ చేశారు.