AP: వైసీపీ నేతలు కావాలని తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైసీపీ నేత బొత్స కాళ్లకు దణ్ణం పెట్టినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని తెలిపారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.