తన సేవలు గుర్తించి బీజేపీ అవకాశం ఇచ్చిందని బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పార్టీలు మారటం లేదని.. పార్టీలే తన దగ్గరకు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు బీసీలకు ఏం చేయాలన్నా బీజేపీతోనే సాధ్యమని.. బీసీల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు.