భారత విదేశాంగ కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి విక్రమ్ మిస్రీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 జులై వరకు, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలో కొనసాగుతారని ఓ ప్రకటనలో కేంద్రం వెల్లడించింది.