KNR: జమ్మికుంట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో టి.విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాలు అందజేశారు. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ, సీపీఎం, బీజేపీ నేతలు పాల్గొన్నారు.