హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రభుత్వం ఆసుపత్రులు, ఎంపిక చేసిన 15 ప్రయివేట్ ఆసుపత్రుల్లో కంటి శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సేవలను ప్రజలు ఎలాంటి ఖర్చు లేకుండా వైద్యుల నిపుణుల సంప్రదింపులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సౌకర్యాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యమని సీఎం తెలిపారు.