AP: విజయవాడ దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్, సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. రాజగోపురం ముందు సభ్యులతో ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ నుంచి ఇద్దరు, జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి 14 మంది ప్రమాణం చేశారు. దుర్గగుడి అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు.