AP: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయాన్ని వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా, కేంద్రమంత్రి విమానాశ్రయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ప్రతి నెలా పరిశీలిస్తున్నారు.