పంజాబ్లో రైతుల ఆందోళన నేపథ్యంలో 163 రైళ్లు రద్దయ్యాయి. ఢిల్లీ, పంజాబ్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైతుల డిమాండ్లు నెరవేర్చాలని కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తోంది. రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా ఆందోళన కొనసాగుతోంది.