TG: CM రేవంత్ రెడ్డితో ఢిల్లీలో US న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డీ.మర్ఫీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణ విజన్-2047 సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మర్ఫీకి రేవంత్ తెలియజేశారు. ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ ప్రాధాన్యాన్ని సీఎం వివరించారు.