AP: కాకినాడ తీరంలో తాబేళ్ల మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పవన్ ఫిర్యాదు చేశారు. కాలుష్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు తనిఖీలు ప్రారంభించారు.