TG: మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు రోజులుగా రైతు సదస్సులో పాల్గొంటున్నారు. అయితే, ఇవాళ జరిగే సభలో సీఎం రేవంత్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభలోనే రైతు భరోసా అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.