TG: ఫార్మాసిటీ విషయంలో పంతాలకు పోవద్దని గతంలోనే సీఎం రేవంత్‌రెడ్డికి సూచించినట్లు BJP ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టా భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. ఫార్మాసిటీ మాకొద్దని గతంలో రైతులు ధర్నా చేశారని, రైతులకు మద్దతుగా తాను కూడా ధర్నాకు వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏవైనా పరిశ్రమలు పెట్టుకోమని రైతులు చెప్పినట్లు గుర్తు చేశారు.