TG: చిక్కడపల్లి పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. న్యాయవాదుల ద్వారా పోలీసులకు లేఖ పంపింది. ‘థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. 45 ఏళ్లుగా థియేటర్ నిర్వహిస్తున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో థియేటర్‌ను మైత్రీ మూవీస్ తీసుకుంది’ అని పేర్కొంది.